Honesty - నిజాయితీ
పరమాచార్య స్వామి వారి చెప్పిన కొన్ని గాథలు: ఇంట్లో అయినా, గుడి లో అయినా మనసుకు నచ్చితేనే, శ్రద్ధ ఉంటేనే పూజ చేయాలి తప్ప ఇంట్లోవారి కోసమో, ఇంకెవరి కోసమో చేయరాదు. తిరుచునాపల్లి ఘటన: ఒకసారి స్వామి వారు తిరుచునాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒక గ్రామంలో వారు వెలుతూ ఉన్నపుడు... ఒక దృశ్యం చూశారు. ఒక అక్క, తన తమ్ముణ్ణి మందలిస్తూ వుంది. ఆ అమ్మాయి వయసు 12 అయి ఉంటుంది. ఇంతకూ ఆమె తన తమ్ముడిని ఎందుకు మందలించింది అంటే, వాడు అబద్ధం చెప్పడం వలన. అలా తమ్ముడు చెడిపోతాడని, ఇక నుంచయినా నిజమే చెప్పవలసిందని ఆ అమ్మాయి అతడికి బోధిస్తోంది. ఆ అమ్మాయిని చూస్తే స్వామి వారికి మహాత్ములెవరో ప్రబోధం చేస్తున్నట్లు అనిపించింది. తరువాత ఎంత కాలం గడిచినా, ఈ సంఘటన ఆయనకు గుర్తుంది పోయింది. కేరళ లో జరిగిన సంఘటన: ఇదిలా వుండగా కేరళలో ఆయనొక సత్రంలో బస చేశారు. పక్కన ఒక గదిలో యిద్దరు నంబూద్రి బ్రాహ్మణులున్నారు. ఇద్దరూ పెద్దవాళ్లే. ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో పూజ సమయం అయింది. అందులో ఒకాయన దేవతార్చన పెట్టె బయటకు తీశాడు. అయితే కబుర్లలో కాలం గడిపిన ఆయనకు పూజ చేసే ఇష్టం రాక, శ్రద్ధ లేకుండా పూజ చేయటం కన్న అసలు ...