హటకేశ్వర గుహ - Hatakeswara Temple
హాటకేశ్వర గుహ
హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైల మల్లిఖార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రమే ఈ హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది.
మహా భక్తుడు కేశప్ప
శివుడు అటికెలో ప్రత్యక్షమైనాడు కాబట్టి ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా' పిలవబడి, కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది.
హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురు దారిలో పాలదార-పంచదారలు ఉన్నాయి. ఇక్కడ ఆదిశంకరాచార్యుడు చాలాకాలం తపస్సు చేసినారు. ఇక్కడ శంకరుల పాద ముద్రలు కూడా కనిపిస్తాయి. శంకరుల వారు హాటకేశ్వరం దగ్గరలో ఒక లోయ లోకి మెట్లు దిగి పోయి, అక్కడ వున్న ఒక గుహలో పరదేవత ను ఆరాధించారు. ఆయన ఆ గుహలో సమాధి స్థితి లో యోగసాధన చేశారు. పరదేవత సాక్షాత్కారాన్ని పొందారు.
చంద్రశేఖర సరస్వతి గారు
కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి గారు ఒకసారి శ్రీశైలం వెళ్లారు. పరమాచార్యుల వారు, శంకరుడు తపస్సు చేసిన గుహ ఎక్కడ వున్నదో స్వయంగా కనుగొన్నారు. ఆ స్థలానికి ఆయన ఎవరూ దారి చూపించే అవసరం లేకుండా తానే పోయి అక్కడ గల పొదలు, తుప్పలు శుభ్రం చేయించి, ఎంతో కాలంగా అక్కడ మరుగు పడి వున్న లింగాన్ని బయట పెట్టారు. అభిషేకాదులు నిర్వహించారు. అక్కడే ఆదిశంకరులు యోగతారావళి రచించినట్లు వారే తెలిపారు.
త్రిపురాంతకం
అదే విధంగా త్రిపురాంతకం లో గల శ్రీ చంద్రమౌళీశ్వరుని కూడ కనుగొని బయటపెట్టి అభిషేకాదులు నిర్వహించారు. వారి వలననే ఆ ప్రాచీన లింగమూర్తులు రెండూ నేడు భక్తులకు దర్శనం అనుగ్రహిస్తూ పూజకు నోచుకుంటూ వున్నాయి.
Thank you 🙏
✍️ Bhagyamati
Comments
Post a Comment