కాళరాత్రి దేవి - kaalaratri devi - Dasara
కాళరాత్రి దేవి:-
ఈ అమ్మవారిని దసరా నవరాత్రులలో 7వ రోజు పూజిస్తారు. సప్తమి తిథి న ఈమె ని ఉపాసించాలి.
పవిత్ర గ్రంథాల ప్రకారం, నవరాత్రి సమయంలో, గొప్ప దేవతలు కూడా తమకు రక్షణ, శక్తి మరియు విజయం కోసం ఆమె ఆశీర్వాదాలను ప్రసాదించమని ఈ సర్వోన్నత దేవతను ప్రార్థిస్తారు.
మూర్తిత్వం:-
ఈ అమ్మవారు ఒక గాడిద మీద ఆసీనురాలై ఉంటుంది. కాళరాత్రి దేవికి నలుగురు చేతులుంటాయి, వీటిలో రెండు చేతులలో మంట ని మరియు కత్తులను కలిగి ఉంటాయి. తరువాతి రెండు చేతులలో ఒకటి వెలుగునివ్వటంలో మరియు వరాలను ఇచ్చేదిగా ఉంటుంది. మొత్తం తొమ్మిది రూపాలలో అత్యంత ఉగ్ర రూపం.
రూప వర్ణన:-
"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.
కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.
కాళరాత్రి మాతను స్మరించినంత మాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూత, ప్రేత, పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె అనుగ్రహమున గ్రహబాధలు తొలగిపోవును. ఈమెను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువులు మొదలగు వాటి భయము గాని, శత్రువుల భయము గాని, రాత్రి భయము గాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తు లగుదురు.
అమ్మవారి పూజ:-
గణపతి పూజతో ప్రారంభించి, షోడశోపచారాలతో ఈ అమ్మవారిని పూజించండి. చివరిలో అమ్మవారికి హారతిని ఇవ్వడం ద్వారా పూజ ముగుస్తుంది.
ఈ అమ్మవారు తన భక్తులను మంచితనంతో, శ్రేయస్సుతో ఉండాలని ఆశీర్వదిస్తుంది. భక్తుల యొక్క అన్ని పాపాలను నశింపచేసి, వారిని సరైన మార్గంలో...పయనించేలా... దారిని చూపుతుంది. పూజించడం వలన అపారమైన ఆనందాన్ని పొందవచ్చు, ఆమె భక్తుల జీవితాల నుండి పాపాలు, అడ్డంకులు మరియు వేదనలు నశిస్తాయి.
నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నం
శ్లోకం:-
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||
Thank you 🙏
https://bhagyamati.blogspot.com/2023/09/blog-post_19.html
✍️ Bhagyamati.
Comments
Post a Comment