Posts

Showing posts from October, 2023

Honesty - నిజాయితీ

Image
పరమాచార్య స్వామి వారి చెప్పిన కొన్ని గాథలు: ఇంట్లో అయినా, గుడి లో అయినా మనసుకు నచ్చితేనే, శ్రద్ధ ఉంటేనే పూజ చేయాలి తప్ప ఇంట్లోవారి కోసమో, ఇంకెవరి కోసమో చేయరాదు. తిరుచునాపల్లి ఘటన: ఒకసారి స్వామి వారు తిరుచునాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒక గ్రామంలో వారు వెలుతూ ఉన్నపుడు... ఒక దృశ్యం చూశారు. ఒక అక్క, తన తమ్ముణ్ణి మందలిస్తూ వుంది. ఆ అమ్మాయి వయసు 12 అయి ఉంటుంది.  ఇంతకూ ఆమె తన తమ్ముడిని ఎందుకు మందలించింది అంటే, వాడు అబద్ధం చెప్పడం వలన. అలా తమ్ముడు చెడిపోతాడని, ఇక నుంచయినా నిజమే చెప్పవలసిందని ఆ అమ్మాయి అతడికి బోధిస్తోంది.  ఆ అమ్మాయిని చూస్తే స్వామి వారికి మహాత్ములెవరో ప్రబోధం చేస్తున్నట్లు అనిపించింది. తరువాత ఎంత కాలం గడిచినా, ఈ సంఘటన ఆయనకు గుర్తుంది పోయింది. కేరళ లో జరిగిన సంఘటన: ఇదిలా వుండగా కేరళలో ఆయనొక సత్రంలో బస చేశారు. పక్కన ఒక గదిలో యిద్దరు నంబూద్రి బ్రాహ్మణులున్నారు. ఇద్దరూ పెద్దవాళ్లే. ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో పూజ సమయం అయింది. అందులో ఒకాయన దేవతార్చన పెట్టె బయటకు తీశాడు. అయితే కబుర్లలో కాలం గడిపిన ఆయనకు పూజ చేసే ఇష్టం రాక, శ్రద్ధ లేకుండా పూజ చేయటం కన్న అసలు ...

శ్రీ మహిషాసుర మర్ధని దేవి - Dasara

Image
శ్రీ మహిషాసుర మర్ధని దేవి అమ్మవారి స్తోత్రం: అయిగిరినందిని నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని, విష్ణువిలాసిని జిష్ణునుతే | భగవతి హే శితికంఠ కుటుంటిని, భూరికుటుంబిని భూరికృతే జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే. Aigiri nandini dance performance దేవీ అవతారం: శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు, శ్రీ మహిషాసుర మర్దనీ దేవి గా దర్శనమిస్తారు. అష్టభూజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురిడిని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవులు కష్టాలను తొలగించింది. మహిషాసురమర్దనీ దేవి అలంకారములో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన అరిష్టాలు నశిస్తాయి. సాత్వికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య స్థైర్య, విజయాలు చేకూరుతాయి. శ్రీ మహిషాసుర మర్ధని అష్టోత్తర శతనామావళి: ఓం మహత్యై నమః ఓం చేతనాయై నమః ఓం మాయాయై నమః ఓం మహాగౌర్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహోదరాయై నమః ఓం మహాబుద్ద్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాబలాయై నమః ఓం మహాసుధాయై నమః (10) ఓం మహానిద్రాయై నమః ఓం మహాముద్రాయై నమః ఓం మహోదయాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాభోగ్యాయై నమః ఓం మహా...

హటకేశ్వర గుహ - Hatakeswara Temple

Image
హాటకేశ్వర గుహ హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైల మల్లిఖార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రమే ఈ హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది.  మహా భక్తుడు కేశప్ప  శ్రీకాళహస్తిలో మహా భక్తుడు రామప్ప ఉన్నట్లే...ఈ హటకేశ్వరానికి మరో గొప్ప భక్తుడు కేశప్ప ఉండేవాడు. ఈయన కుమ్మరి కులానికి చెందినవాడు. అటికలను తయారు చేస్తూ హటకేశ్వరంలోని శివుని చూడడానికి వచ్చిన భక్తులకు భోజనాన్ని ఏర్పాటు చేసేవాడు.  ఇతని పేరు నలువైపులా ప్రసిద్ధిగాంచింది.  ఈర్ష్య చెందిన ఇరుగుపొరుగు వారు, మహాశివరాత్రికి ముందు రోజున కుండలన్ని పగల కొట్టి వేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకి భోజనం ఎలా ఏర్పాటు చేయాలో అర్థం కాక బాధపడుతూ... ఉంటే శివుడు అటిక లో ప్రత్యక్షమై అతని కష్టాన్ని చూసి, గది అంతా కుండలతో నింపి వేశాడు మహా భక్తుడు కేశప్ప ఆ కొండలలో భక్తులందరికీ భోజనం వండి తృప్తి తీర బుజింప చేశాడు. శివుడు అటికెలో ప్రత్యక్షమైనాడు కాబట్టి ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా' పిలవబడి, కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది. హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురు దారిలో పాలదార-...

మణిద్వీప వర్ణన - Manidweepa varnana

Image
  మ ణిద్వీప వర్ణన - దేవీ భాగవత శ్లోకాలు... వేదవ్యాసుడు రచించినాడు. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1 సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2 లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3 పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం || పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 5 అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 6 అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కుల దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు|| 7 కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 8 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివా...

కాళరాత్రి దేవి - kaalaratri devi - Dasara

Image
కాళరాత్రి దేవి:- ఈ అమ్మవారిని దసరా నవరాత్రులలో 7వ రోజు పూజిస్తారు. సప్తమి తిథి న ఈమె ని ఉపాసించాలి.  పవిత్ర గ్రంథాల ప్రకారం, నవరాత్రి సమయంలో, గొప్ప దేవతలు కూడా తమకు రక్షణ, శక్తి మరియు విజయం కోసం ఆమె ఆశీర్వాదాలను ప్రసాదించమని ఈ సర్వోన్నత దేవతను ప్రార్థిస్తారు. మూర్తిత్వం:-   ఈ అమ్మవారు ఒక గాడిద మీద ఆసీనురాలై ఉంటుంది. కాళరాత్రి దేవికి నలుగురు చేతులుంటాయి, వీటిలో రెండు చేతులలో మంట ని మరియు కత్తులను కలిగి ఉంటాయి. తరువాతి రెండు చేతులలో ఒకటి వెలుగునివ్వటంలో మరియు వరాలను ఇచ్చేదిగా ఉంటుంది.  మొత్తం తొమ్మిది రూపాలలో అత్యంత ఉగ్ర రూపం. రూప వర్ణన:- "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరిం...

Druvuni thapassu

Image
  భాగవతం లో పొందు పరచిన దృవుని కథ ఆధారంగా వాసుదేవుని ప్రసన్నం చేసుకునేందకు దృవుడు అడవులకు వెళ్లి పోతాడు. నారద మహర్షి యొక్క దృవునికి ఇచ్చిన ఉపదేశం.... భాగవతం లో ఇలా చెప్ప బడింది. కుమారా! ధ్రువా! పరమాత్మ మన సౌకర్యం కోసం ఆకారం ధరించి మన ముందు మెలగుతూ ఉంటాడు. ఆ స్వరూపానికి మనం పూజలు చేస్తూ పుణ్యం సంపాదించుకోవాలి.  ఆ స్వామి లేత గరిక వంటి దేహ కాంతి కలవాడు. కాబట్టి లేత గరికలు ఆయనకు సమర్పించుకోవాలి.  అందమైన పద్మాల వంటి నేత్రాలు ఆయనవి. వానిని భావిస్తూ పద్మాల తో పూజించాలి.  ఆయనకు తులసీదళాలమాల ను ధరించటం ఇష్టం. కాబట్టి తులసీ దళాలను సమర్పించుకోవాలి.  ఆయన అతి నిర్మలమైన నడవడి కలవాడు. కనుక మాలలతో అర్చించాలి.  స్వామికి వాహనం పక్షి. పూజకు పనికివచ్చే పత్రాలు ఆయనకు ఇచ్చుకోవాలి.  సృష్టికీ, దేవతలకూ, సర్వమునకూ ఆయన మూలకారణం. కాబట్టి వనాలలోని మొక్కల వ్రేళ్ళను తెచ్చి పూజలు చేయాలి.  ఆయన పచ్చని పట్టుబట్ట ధరిస్తాడు. కాబట్టి మేలైన బూరుగుచెట్టు మొదలైనవాని పట్టలతో నేసిన వస్త్రాలు అందించాలి.  మట్టితోగానీ, రాతితో గానీ, కొయ్యతో గానీ రూపొందించుకొన్న విగ్రహాన్ని ముందు పెట్టుకొన...

Gayatri devi

Image
  శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారు... శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి. Gayatri devi upasana ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాత్మకంగా గాయత్రీదేవి -వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధం వుంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించడంవలన సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు. ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే Thank you 🙏 Druvuni thapassu                     ...