Druvuni thapassu
భాగవతం లో పొందు పరచిన దృవుని కథ ఆధారంగా వాసుదేవుని ప్రసన్నం చేసుకునేందకు దృవుడు అడవులకు వెళ్లి పోతాడు. నారద మహర్షి యొక్క దృవునికి ఇచ్చిన ఉపదేశం....
భాగవతం లో ఇలా చెప్ప బడింది.
కుమారా! ధ్రువా! పరమాత్మ మన సౌకర్యం కోసం ఆకారం ధరించి మన ముందు మెలగుతూ ఉంటాడు. ఆ స్వరూపానికి మనం పూజలు చేస్తూ పుణ్యం సంపాదించుకోవాలి.
ఆ స్వామి లేత గరిక వంటి దేహ కాంతి కలవాడు. కాబట్టి లేత గరికలు ఆయనకు సమర్పించుకోవాలి.
అందమైన పద్మాల వంటి నేత్రాలు ఆయనవి. వానిని భావిస్తూ పద్మాల తో పూజించాలి.
ఆయనకు తులసీదళాలమాల ను ధరించటం ఇష్టం. కాబట్టి తులసీ దళాలను సమర్పించుకోవాలి.
ఆయన అతి నిర్మలమైన నడవడి కలవాడు. కనుక మాలలతో అర్చించాలి.
స్వామికి వాహనం పక్షి. పూజకు పనికివచ్చే పత్రాలు ఆయనకు ఇచ్చుకోవాలి.
సృష్టికీ, దేవతలకూ, సర్వమునకూ ఆయన మూలకారణం. కాబట్టి వనాలలోని మొక్కల వ్రేళ్ళను తెచ్చి పూజలు చేయాలి.
ఆయన పచ్చని పట్టుబట్ట ధరిస్తాడు. కాబట్టి మేలైన బూరుగుచెట్టు మొదలైనవాని పట్టలతో నేసిన వస్త్రాలు అందించాలి.
మట్టితోగానీ, రాతితో గానీ, కొయ్యతో గానీ రూపొందించుకొన్న విగ్రహాన్ని ముందు పెట్టుకొని అర్చనలు చెదరని భక్తితో చేయాలి. లేదా పవిత్రమైన నదీజలములయందు కూడా చేయవచ్చు. అలాగే మహిమగల క్షేత్రాలలో కూడా ఆచరించవచ్చు.
Thank you 🙏
✍️ Bhagyamati.
Comments
Post a Comment