Posts

Showing posts from November, 2023

కార్తీక దీపము - Endless flame of light

Image
  కార్తీక దీపము కార్తీకపౌర్ణమి సాయం సమయంలో ప్రమిదలలో చమురు పోసి, దీపములు వెలిగించే ఆచారము భారత దేశమంతా ఉంది. ప్రతి యింటి వాకిటి ముందు ఈ దీపాల వరుస మినుకు మినుకు మంటూ కనిపిస్తుంది. ఈరోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు.    కార్తీకమాసం అనగానే వనభోజనాలు, ఉపవాసాలు, నదీస్నానం వంటి ఆచారాలతో పాటు దీపం వెలిగిస్తాం.  ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము చెబుతాము. ఆ శ్లోకానికి అర్థము- ”ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసి, భగవంతుని స్మరిస్తూ, దీప దర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు, పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారు. కృత్తికానక్షత్రము:  ఈరోజు దీపములో దామోదరుడు, ఈశ్వరుడు, త్య్రంబకుడు... మొదలైన దేవతలను ఆవాహనచేసి ప్రార్థిస్తారు. ఇది సంప్రదాయము. కృత్తికా నక్షత్రము, పూర్ణిమతిథి - రెండూ ఈరోజు కలిసి వస్తున్నాయి. దేవాలయాలకు కృత్తికా నక్షత్రమే ముఖ్యము.  తిరువణ్ణామలైలో కృత్తికా నక్షత్రమన కృత్తికా దీపము వెలిగిస్తారు. ఇండ్లలో పూర్ణిమనాడు దీపాలు పెడతారు.  కృత్తికానక్షత్రము సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనకు ముఖ్యమైనది. మరొక విశేషం, ఏమంటే – శివాలయంల...