Gayatri devi
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారు... శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి. Gayatri devi upasana ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాత్మకంగా గాయత్రీదేవి -వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధం వుంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించడంవలన సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు. ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే Thank you 🙏 Druvuni thapassu ...